రైతును రాజు చేయటమే కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Wednesday March 31, 2021
జగిత్యాల, మర్చి 30 (ప్రజాపాలన ప్రతినిధి) : దేశవ్యాప్తగా రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాల నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలకు వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల ఏర్పాటును స్వాగతిస్తూ రైతు బంధు నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కోసం 6 వేల సెంటర్లను ధాన్యం సేకరించటానికి 20 వేల కోట్లు నగదు సమీకరణకు అదేశాలివ్వడం ద్వార ముఖ్యమంత్రి గారికి రైతులపట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని తెలంగాణలో నడుస్తున్నది రైతు రాజ్యమని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కోటి ఎకరాల మాగాణి చేస్తానని సీఎం  అన్నారని గుర్తు చేశారు. సాగులో తెలంగాణ దేశానికి ఆదర్శమని దేశంలో వరి ఎగుమతుల్లో 2వ స్తానంలో ఉన్నదని 55 లక్షల ఎకరాలలో వరి పంట వేశారని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పడమర నుండి తూర్పుకి నీటిని ఎత్తిపోసిన ఘనత సీఎం గారిదని అన్నారు. కొంత మంది రైతుల ముసుగులో ప్రతిపక్ష పార్టీల ప్రోద్బలంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసిలు మేడిపల్లి మనోహర్ రెడ్డి సంగెపు మహేష్ ఏఎంసి చైర్మన్ దామోదర్ రావు రైతుబంధు కన్వీనర్లు రవీందర్ రెడ్డి జుంబర్తి శంకర్ దామోదర్ రావు  ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి  సురేందర్ చెరుకు జాన్ రాజిరెడ్డి గంగమల్లు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.