ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, కాలనీ వాసులు కలిసి సీఐ మహేందర్ రెడ్డి కి సన్మానం

Published: Monday September 27, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 26, ప్రజాపాలన (ప్రతినిధి) : 2021 వినాయక చవితి ఉత్సవాలను, గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతి భద్రతలతో సమర్థతతో సామరస్యంగా నిర్వహించిన మీర్ పేట పోలీస్ సిబ్బంది. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, శ్రీ సాయి కృప నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు మేకల యాదగిరి ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో మీర్ పేట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేందర్ రెడ్డి కి సన్మానం. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ... రాత్రి పగలు విధులు నిర్వహించిన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డికి శక్తి వంచన లేకుండా బందోబస్తులో ఎంతో కృషి చేసిన పోలీస్ స్టేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కృపా నగర్ కాలనీ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మేకల యాదగిరి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, పెద్ది రెడ్డి, సహదేవ్ లు కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు.