రామాలయం ఆవరణలో మజ్జిగ పంపిణీ

Published: Monday April 11, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 10 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రామ్ ఆలయం ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సందర్భంగా భక్తులకు  సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ అశోక్ కుమార్, ఎస్సైలు గంగన్న, జగదీష్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి పటేల్, యూత్ అధ్యక్షులు ప్రణయ్, ఎస్టియు జిల్లా అధ్యక్షులు సంజయ్, నాగరాజు,సుప్రజ, ఆకాష్, ప్రహ్లాద్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.