దెందుకూరు ఉన్నత పాఠశాలలో ఉచిత ఆయుర్వేదం వైద్య శిబిరం*

Published: Saturday January 21, 2023

మధిర రూరల్ జనవరి 20 ప్రజా పాలన ప్రతినిధి  మధిర మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దెందుకూరు  నందు మధిర ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు డాక్టర్ శ్రీలత  ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా పరిసరాలు ఇంటి చుట్టూరు శుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరికి మన బాధ్యతగా ఉండాలని ఆమె తెలిపారు ఈ శిబిరంలో విద్యార్థిని విద్యార్థుల సమస్యలను పరీక్షించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.