ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం కృషి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Tuesday July 27, 2021

మంచిర్యాల బ్యూరో, జూలై 26, ప్రజాపాలన : ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం పని చేస్తుందని, ఇందులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హెూళీకేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, శాసనమండలి సభ్యులు పురాణం సతీష్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు లతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో దరఖాస్తు చేసుకున్న దాదాపు 6,700 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుందనితెలిపారు., ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పేదవారికి రేషన్ కార్డులతో పాటు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు., ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రజల సౌకర్యార్థం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే విధంగా సదుపాయం కల్పించడం జరిగిందని గుర్తుచేశారు. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పనుల మీద వేరే ప్రాంతాలు వెళ్లేవారు వారికి అందుబాటులో ఉన్న రేషన్ షాపులో బియ్యం తీసుకునే విధంగా సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, జిల్లా మేనేజర్ గోపాల్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు, లబ్ధిదారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.