ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ డే ఎయిడ్స్ అంతం మన అందరి పంతం అసమానతలను, ఎయిడ్స్ మహమ్మారులను అంతం చేద్ద

Published: Thursday December 02, 2021
మధిర డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : మధిర టౌన్ లోని ప్రభుత్వ వైద్యశాల నందు పిహెచ్సి దెందుకూరు పిహెచ్సి మాటూరుపేట మరియు సివిల్ హాస్పిటల్ వైద్య అధికారులు డాక్టర్ అనిల్ కుమార్ సీనియర్ గైనకాలజీ స్పెషలీస్ట్ డాక్టర్  మనోరమ మేడం పిహెచ్సి దెందు కురు వైద్య అధికారి డా శశిధర్ పిహెచ్సి మాటూరు పేట వైద్యఅదికారి డాక్టర్ వెంకటేష్  పిల్లల డాక్టర్ శ్రీనివాస్ డా పుష్పలత ఆధ్వర్యలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీ మరియు శిభిరాలు నిర్వహించడం జరిగింది. దీని లో భాగంగా చిత్ర పటాలు కరపత్రాలు ఫ్లిప్ ఛార్ట్స్ ద్వారా మెయిన్ రోడ్డు లో ఉన్న దుకాణాదారులకు పంచి సంపూర్ణ అవగాహన చేసినారు. ఈ సందర్బంగా డా మనోరమ డా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎయిడ్స్ ను అంత మొందిద్దాం, అసమానత లు మరియు మహమ్మారిని రూపు మాపుధాo అని ప్రతిఒక్కరు ఎయిడ్స్ గురించి తెలుసుకొని ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని  సూచించారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో కైన్డ్లీ స్వచ్చందా సంస్థ డైరెక్టర్ వి అనూష రెడ్డి పాల్గొని హెచ్ఐవి /ఎయిడ్స్ అవగాహనా నిమిత్తం 5 వేల కరపత్రలు ముద్రించి వివిధ గ్రామాలు నుoడి వచ్చిన పారామెడికల్ సిబ్బంది కి అందజేసినారు. ఈ కార్యక్రమంలో CHC హెడ్ నర్స్ మనోరమ పిహెచ్సి దెందుకు రు హెచ్స్ ఆశ మిత్ర లంకా కొండయ్య పిహెచ్సి మాటూరు పేట హెచ్స్ వి భాస్కర్ రావు పీపీ యూనిట్ సిబ్బంది పిహెచ్సి ల యెక్క పారా మెడికల్ సిబ్బంది  ఐసీటీసీ లింక్ వర్క్ లూ సుశీల  ఆరోగ్య మిత్రులూ 108, మరియు 104సిబ్బంది 102సిబ్బంది స్టాఫ్ నర్స్ లూ ఫార్మా సిస్ట్ Lt లూ పాల్గొన్నారు.ఎయిడ్స్ HIV రహిత సమాజం కోసం కృషి చేద్దాంఆజాద్ అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగాప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు MJP ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కృష్ణాపురం నందు మాటూరు పేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో HIV, ఎయిడ్స్ పై ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులలో వైరస్ లక్షణాలు, సంక్రమించే విధానం గురించి తెలియ పరుస్తూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ, ప్రతిరోజు ఫిట్నెస్ ఎక్సర్సైజులు చేస్తూ ఇమ్యూనిటీని పెంచుకోవాలని, అలానే covid నివారణ కొరకు మాస్క్ ధరించాలని తెలియపరిచారు. ఈ  ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గురవయ్య, వైస్ ప్రిన్సిపాల్ సాగర్, ఆరోగ్య పర్యవేక్షకులు భాస్కర్ రావు, లంక కొండయ్య, స్టాఫ్ నర్స్ శ్రీలత, బాజీ, ఆశ కార్యకర్త సునీత పాల్గొన్నారు.