కంకణాల పద్మ రెడ్డి పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Published: Thursday September 09, 2021
మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంకణాల పద్మ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్, సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం సిద్దార్థ రాంమ్మూర్తిలు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని ఐబి గెస్ట్ హౌజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలెఖరుల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం, సబ్బండా వర్గాల ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ఒక దళిత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కంకణాల పద్మ రెడ్డి అవమానకరంగా మాట్లాడారని అన్నారు. దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే కావడం తను పెట్టిన భిక్ష అని ఆరోపిస్తూ పద్మారెడ్డి దళితుల ఆత్మగౌరవాన్ని అవమాన పరిచారని మండిపడ్డారు. తనకేమైనా కాంట్రాక్టు బిల్లులు వచ్చేది వుంటే దానికి సంబంధించిన అధికారులను అడగాలి తప్ప అగ్రకుల అహంకారంతో నీ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. దుర్గం చిన్నయ్య ఎవరి భిక్ష ద్వారా ఎమ్మెల్యే కాలేదని, భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ఆధారంగా ఒక వెనుకబడిన జాతిని గుర్తించి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జ శరత్, కుసుమ మధు సుధన్, ఏర్రోళ్ళ నరేష్, నారమల్ల పురుషోత్తం, గోసిక మనోజ్, అంగూరి సుభాష్, పట్నం చక్రధర్, దుగుట కిరణ్, తదితరులు పాల్గొన్నారు.