కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్నీ విధాలుగా ఆదుకుంటాం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గ

Published: Friday July 22, 2022
బోనకల్, జూలై21 ప్రజా పాలన ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి దుర్గారావు అన్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన పిలుపు మేరకు మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం గురువారం చొప్పకట్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు.ఈ 8 సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తల ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో మోడీ అనిల్ అంబానీ, అధాని మోడీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు దోచి పెడుతుంటే రాష్ట్రంలో కేసీఆర్ మెగా కృష్ణా రెడ్డి, మై హోమ్ రామేశ్వరరావు వంటి పారిశ్రామికవేత్తలకు ప్రజా సంపదను దోచి పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఉన్న ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కయ్యారని అన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్పు చేసుకొని మేం అభివృద్ధి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు కాలం చెల్లె రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు . రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరంగల్ రైతు సంఘర్షణ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ను కచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, ఇప్పుడు కూడా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. త్వరలోనే అఖిల భారత కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు, మహిళల కోసం ఒక ప్రణాళిక రూపొందించనున్నదని అన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ లో పొందుపరచిన అంశాలను రైతులకు క్షుణ్నంగా వివరించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్స్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి రామకోటేశ్వరరావు,మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు నల్లమోతు సత్యనారాయణ, మండల ఎస్సీ సెల్ నాయకులు మర్పల్లి ప్రేమ్ కుమార్, బీసీ సెల్ మండల అధ్యక్షులు కందుల పాపారావు,గ్రామ శాఖ అధ్యక్షుడు బొగ్గవరపు సోమయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతయ్య, బొడపాటి నాగేశ్వరరావు, బాబు రామారావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు ,రాకేష్,గ్రామాల పార్టీ నాయకులు,కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.