కోరుట్ల పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా

Published: Wednesday January 19, 2022

కోరుట్ల, జనవరి 18 (ప్రజాపాలన ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా సాక్షి రిపోర్టర్ పోశెట్టి పై దాడికి నిరసనగా కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న ప్రెస్ వ్యవస్థలను ఇబ్బంది కలిగించే రీతిలో వ్యవహరించడం సహించేది లేదన్నారు. మాక్లూర్ విలేకర్ పోశెట్టి దాడికి దిగిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ధర్నా రాస్తారోకో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు సలీం ఫారుక్, అంజి గౌడ్, నవీన్, లక్ష్మీరాజం, ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, పాత్రికేయులు బలిజ సంతోష్, నారాయణ, శ్రీకాంత్, రాజేందర్, గజం శంకర్, శ్రీనివాస్, పరందం, సత్య రావు, సతీష్ గోడ, కే రాజు, ఉరుమడ్ల శ్రీను, సాజిద్, ముసఫైర్, మొబిన, సలావుద్దీన్, అనాస రబ్, సుమన్, రాజా రమేష్, సాయి, ముఖం వాజిద్, షికారి గోపి, లింగ ఉదయ్ రాజు, ఎన్ టివి రాజు, వెంకట్ రెడ్డి, సంతోష్, ఓం ప్రకాష్, అశోక్, మిర్జా, ముఖేష్, బాణల శ్రీధర్, మహమ్మద్ హుస్సేన్, కాశి రెడ్డి వెంకట్ రెడ్డి, ఇంద్రాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.