పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

Published: Thursday May 19, 2022

వైరా, మే 18 (ప్రజాపాలన న్యూస్): నిరుపేద విద్యార్థులకు ఆత్మ బంధు గ్రామీణ పేదల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెబ్బవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థులకు  స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు.   ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు పిడతల నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద, వృద్ధులు, వితంతువులకు ఆర్థిక చేయూత అందించడమే సంఘం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.  అనంతరం ఆ గ్రామ సర్పంచ్ సాధం రామారావు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సేవా  కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.