ఓల్డ్ ఏజ్ హోమ్ లో విశేష అన్నదానం కార్యక్రమం

Published: Thursday October 07, 2021
బాలాపూర్: అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లెలగూడ గీతాంజలి లైయన్ క్లబ్ పి ఆర్ ఓ వేణుమాధవ్ మిత్రుడు అంజన్ రెడ్డి పుట్టినరోజు శుభ సందర్భంగా జిల్లెలగూడలో ఉన్న శ్రీ కీర్తన ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుని ఆ వృద్ధులందరికీ విశేష అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. లైయన్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.... నా మిత్రుని జన్మదిన వేడుకలు మా తాతయ్యల, తండ్రులు మధ్యన జరుపుకుంటున్నటు ఆనందంగా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్, అనిల్ కుమార్, అనిల్, హేమంత్, నరేందర్, అదేవిధంగా కాలనీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు.