కరోనాను జయించిన మల్లాది వాసు

Published: Tuesday May 04, 2021

మధిర, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీకరోనాని జయించిన మల్లాది వాసు అభిప్రాయం..ఏప్రిల్ 12న నేను వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాదు వెళ్లి వచ్చాను. అప్పటికే ఇంట్లో నా సతీమణి సవిత కి స్వల్పంగా బాధపడుతున్నట్టు ఉంది కానీ చెప్పలేదు కరోనా లక్షణాలు కనిపించడంతో 14 వ తారీకు ఇంట్లో అందరికీ పరీక్షలు నిర్వహించగా నాకు తప్ప మిగిలిన ఆరు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినది. ఆ రోజు నుండి విడివిడి గా ఐసోలేషన్ లోని ఉంటూ స్థానిక వైద్యులు పర్యవేక్షణలోనే చికిత్స తీసుకున్నాము. 75 సంవత్సరాల వయసున్న మా అమ్మ నాన్నతో సహా కుటుంబం అంతా రికవరీ అవుతున్న సమయంలో ఏడవ రోజు నుండి నాకు జ్వరం రావడం, తగ్గకపోవడంతో స్థానిక వైద్యులు టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి 27 వ తారీఖు దాకా మోతాదు పెంచుకుంటూ యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ వాడినా ఫలితం రాకపోగా సహజంగానే నా శరీర రక్షణ వ్యవస్థలో ఉన్న antizens T cells రక్త కణాలు వ్యవస్థ కుప్పకూలిపోయి శరీరంలో పోరాడే వ్యవస్థలు లేకపోవడం వలన వైరస్ డామినేషన్ పెరిగిపోయి గంటల వ్యవధిలోనే ఊపిరితిత్తులకు చేరుకొని 20 స్కోర్ దాటి damage చేస్తున్న సందర్భంలో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఆక్సిజన్ అవసరమైన సందర్భంలో నా chest scan reports అన్నింటిని వాట్స్అప్ ద్వారా పరిశీలించిన మిత్రుడు నాకు అత్యంత ఆప్తుడు తెలంగాణ  ఎక్సైజ శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ గారు తక్షణం స్పందించి ఖమ్మం హాస్పటల్ నుండి 27వ తారీకు రాత్రి 10 గంటలకు ప్రత్యేక వాహనంలో 3 గంటల్లో హైదరాబాద్ కి తరలించి Banjarahills star hospital కి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ఆ తర్వాత రోజు 28వ తారీకు వరకు జరిగిన వైద్యంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాను. ఆరు రోజులపాటు స్టార్ హాస్పిటల్ లో పోరాడి గత రాత్రి 8 గంటల సమయంలో విజయంతో బయటికి వచ్చాను. ఇదంతా జరగటానికి కారణం నా శరీరం స్పందించిన తీరు మాత్రమే తర్వాతే డాక్టర్లు అందుకే కోవిడ్ ప్రోటోకాల్ తెలిసిన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చికిత్సతీసుకొని మన అందరి శరీరంలో ఉండే సహజ శరీర రక్షణ వ్యవస్థ కాపాడుకుంటూ తద్వారా మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ప్రాణాపాయ స్థితి పోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మీ మల్లాది వాసు