ధర్మారం లో కరెంటు కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ ముందు గ్రామస్తులు, రైతులు ధర్నా

Published: Wednesday February 01, 2023

కోరుట్ల, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో కరెంట్ సబ్ స్టేషన్ ముందు కరెంటు కోతలకు నిరసనగా గ్రామస్తులు , రైతులు ధర్నా దిగారు.రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.24 గంటలు కరెంటు ఇస్తున్నాము అనుకుంటానే కోతలు విధిస్తూ రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని  ప్రభుత్యం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు.. వచ్చినప్పుడు నాణ్యత సరిగ్గా ఉండదు.. కరెంట్‌ లేక పంటలు ఎండితే .. నాణ్యత లేక మోటార్లు కాలిపోతున్నాయని మండలంలోని ధర్మారం రైతులు ధర్నాకు దిగారు. నాణ్యమైన కరెంట్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్మారం గ్రామ రైతులు మంగళవారం సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం మాటలు నీటి మూటలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక పొలాల వద్దే పడిగాపులు పడుతున్నామన్నారు. వోల్టెజ్‌ హెచ్చుతగ్గులతో మోటార్లు కాలిపోతుంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని ఆవేదనం
వ్యక్తం చేశారు. అధికారులు పై నుండి
ఆదేశాలంటూ సక్రమంగా కరెంట్‌ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. శీతాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే
రానున్న వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని
భయపడుతున్నారు. వేసవిలో ఇదే పరిస్థితి ఉంటే
తమ పంటలు ఎండిపోవడం ఖాయమని అదే
జరిగితే మా బతుకుల్లో మళ్లీ కష్టాలే ఉంటాయని
వారు వాపోతున్నారు. నాణ్యమైన కరెంటు సరైన
వేళల్లో సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ సబ్‌
స్టేషన్‌ ఎదుట బైఠాయించారు.ఖచ్చితమైన హామీ ప్రభుత్వం నుండి లభిస్తేనే ధర్నా
విరమిస్తామని, వట్టిమాటలు నమ్మి మా పంటలను,బతుకులను పణంగా పెట్టబోమని హెచ్చరించారు.అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి నాణ్యమైన కరెంట్‌ను 24 గంటలు అందించేలా తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. గంటకు పైగా ధర్నా కొనసాగడంతో వాహనాలన్నీ రోడ్డుపై నిలిచిపోయాయి.