కనుల పండగగా హనుమాన్ శోభాయాత్ర ** కాషాయమయంగా మారిన ఆసిఫాబాద్.**

Published: Monday April 03, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 02 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని ఇస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వందలాది సంఖ్యలో హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొనగా ఆదివారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర పట్టణ వీధుల్ని కాషాయం చేసింది. జైశ్రీరామ్ జై జై హనుమాన్ అన్న నినాదాలతో హోరెత్తించారు. 11 అడుగుల వీరాంజనేయ విగ్రహాన్ని ప్రత్యేక వ్రతంపై ఏర్పాటు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు జెడ్పిటిసి అరిగిల నాగేశ్వర్ రావు, ఆలయ కమిటీ ప్రముఖులతో కలిసి స్వామివారి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి యాత్ర ప్రారంభించారు. సాయిబాబా మందిర్, పొట్టి శ్రీరాములు చౌక్, గణేష్ మందిర్, కేశవనాద స్వామి ఆలయం, రావుల వాడ, కసాబ్వాడా, సందీప్ నగర్, బజార్ వాడ, వివేకానంద చౌక్, అంబేద్కర్ చౌక్ ల మీదుగా డీజే పాటలతో, దీక్ష స్వాముల నృత్యాలతో, హోరెత్తిన శోభయాత్ర ఆలయం నుంచి పట్టణ వీధుల్లో సుమారు 5 కిలోమీటర్లు సాగింది. జెడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, లు శోభాయాత్రలో పాల్గొని భక్తులతో కలిసి నృత్యాలు చేశారు. పట్టణములో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా నిర్వహించిన శోభయాత్రను అభినందించారు. శోభాయాత్ర సందర్భంగా భక్తులు పాలు, పండ్లు, మజ్జిగ, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలువేరు వెంకన్న, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంధం శ్రీనివాస్, విశాల్, బాలేష్ గౌడ్, ఆలయ కమిటీ ధర్మపురి వెంకటేశ్వర్లు, గుండా వెంకన్న,ఎక్కిరాల శ్రీనివాస్, పిన్న వివేక్, మురళి గౌడ్, గడ్డల వెంకన్న ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.