ఎవరి వద్దకు వెళ్లక్కర్లేదు.....!! సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాను. జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్.

Published: Wednesday September 21, 2022
ఎవరి వద్దకు వెళ్లక్కర్లేదు.....!!
 
సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాను.
జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్.
 
 
పాలేరు సెప్టెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి నేలకొండపల్లి
మాకు న్యాయం కోసం ఎవరిఎవరోద్దకు వెళ్తున్నాం.....మా సమస్య ను
పరిష్కరించటం లేదని రైతులు జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ వద్ద వాపోయారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు ఇస్తే..డబుల్ కటింగ్ చేశారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారి పనులను మండలం లోని గువ్వలగూడెం. నేలకొండపల్లి. పైనంపల్లి. గ్రామాల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గువ్వలగూడెం రైతులు ఎదుర్కుంటున్న సమస్య ను వివరించారు. సమస్య పరిష్కారం కోరకు ఎవరి వద్ద కు పడితే వారి వద్ద కు వెళ్లి వేడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి ఈ సమస్య పలు చోట్ల ఉందన్నారు. మీరు ఎవరి దగ్గరకు వెళ్లక్కర్లేదు.. త్వరలోనే సమస్య ను పరిష్కరిస్తానని తెలిపారు. రైతులు అంతా తహశీల్దార్ వద్ద కు వెళ్లి వివరాలు
 అందించాలని సూచించారు. అక్కడ నుంచి నేలకొండపల్లి లో పనులు నిలిచిన పాత బస్టాండ్ సెంటర్ లో ఆగారు. పనులు ఆగిన విషయం ను అధికారులు ను అడిగి తెలుసుకున్నారు. రహదారి ను చెరువు కట్ట వైపు జరిపేందుకు అవకాశాలు ఉన్నాయా లేనిది స్వయంగా చెరువు కట్ట పరిశీలించారు. చెరువు కట్ట వైపు రోడ్డు జరిపే వీలు లేదు కాబట్టి అక్కడ ఆక్రమణ లో ఉన్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. నేలకొండపల్లి నిర్మాణం లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ను వారికి
కేటాయించాలని ఆదేశించారు. లేని పక్షంలో ఆక్రమణ లో ఉన్న ఇళ్ల ను
 
తొలిగించాలని ఆదేశించారు. పైనంపల్లి వద్ద జాతీయ రహదారి పనులను
 
పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
 
ఆయన వెంట అదనపు కలెక్టర్ మధుసూధన్, నేషనల్ హైవే పీడీ దుర్గాప్రసాద్. ఇరిగేషన్ ఈఈ సమ్మిరెడ్డి, డీఈఈ మన్మధరావు, తహశీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీవో కె.జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.