*మడుపల్లి లో ఘనంగా స్త్రీ విద్యా స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Published: Wednesday January 04, 2023
మధిర మధిర జనవరి 3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మడుపల్లి  నందు *పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు షేక్ నాగూర్ వలి* భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని, సంఘసంస్కర్త,కవి, రచయిత, *స్త్రీ స్ఫూర్తి ప్రదాత మహనీయులు శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి* సందర్భంగా  చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు 
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు  మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన కోసం, స్త్రీ విద్య వ్యాప్తి కోసం, బడుగు బలహీన వర్గాలకు విధ్య అందించటం కోసం, వితంతు పునర్వివాహాల  కోసం,   శ్రీమతి సావిత్రిబాయి పూలే జీవితాంతం కృషి చేశారన్నారు. ప్లేగు వ్యాధి విస్తరిస్తున్నప్పటికీ అంటువ్యాధి అని తెలిసినా పీడితులకు వైద్య సదుపాయం అందించడంలో ప్రత్యక్షంగా పాల్గొని తన ప్రాణాలను కూడా త్యాగం చేశారన్నారు. *మహిళల హక్కులే మానవ హక్కులని* ఎలుగెత్తి చాటిన ఘనత ఆమె అన్నారు. ఆంగ్ల విద్య ప్రాధాన్యతను గుర్తించి అట్టడుగు వర్గాలకు ఆంగ్ల విద్య అందించుటకు విశిష్ట కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో *పాఠశాల ఉపాధ్యాయులు తోట నరసింహారావు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, బూసా కోటేశ్వరరావు, పైడిపల్లి కిషోర్, శీలం రామిరెడ్డి, కోనా బాబురావు యెహోషువ, జ్యోతిర్మయి, కృష్ణయ్య,రాణి, చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది సూర్య ప్రకాష్ రావు, లూర్ధు మరియు విద్యార్థులు* పాల్గొన్నారు.