చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

Published: Monday February 20, 2023
జన్నారం, ఫిబ్రవరి 19, ప్రజాపాలన: మండలంలోని పలు గ్రామాలలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (153) వేడుకలను హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఆదివారం శివాజీ సేన నాయకులు అదిలాబాద్ నియోజకవర్గ నాయకులు బాపూరావు మండలంలోని ఇంధన్ పల్లి, తొమ్మిది గుడిసెల పల్లె, రేండ్లగూడ లలో ఛత్రపతి శివాజీ  విగ్రహ స్థాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుని గూడా కవ్వాల్ గ్రామాలలో చత్రపతి శివాజీ విగ్రహం అయన ఆవిష్కరించారు. చత్రపతి శివాజీ  16 సంవత్సరాల వయసులోనే పరాయి పాలకులపై సమర శంఖం పూరించి దేశ భక్తిని చాటుకొని దేశ వ్యతిరేక, ధర్మం వ్యతిరేక సంఘ విద్రోహుల పాలిట సింహస్వప్నంగా నిలచి అఖండ హైందవ భారతావని గురించి గొప్ప పోరాటం చేశాడన్నారు. శివాజీ జీవితం నుంచి ఈనాటి యువకులు జాతీయత దేశభక్తి స్వశక్తి మాతృభక్తి నేర్చుకోవాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా రాథోడ్ రమేష్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ విగ్రహనికి 20000 రూపాయలు విరాళం అందజేసినట్టు తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని హిందూ వాహిని నాయకులు చత్రపతి శివాజీ విగ్రహానికి దాతలు ముందుకు వచ్చి విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల చెందిన చత్రపతి శివాజీ అభిమానులు హిందూ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని విశ్రాంతి కలెక్టర్ చత్రపతి శివాజీ ప్రతిష్టాపన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని హిందూ వాహిని భక్తులు వారు కూడా అన్నదాన కార్యక్రమం కోసం తమ వంతు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని భక్తులు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అభిమానులు, గ్రామ ప్రజలు, ఇతరులు పాల్గొన్నారు.