*కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Published: Wednesday September 14, 2022

గోదావరి ఖని, సెప్టెంబర్ 12, ప్రజాపాలన: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,   కార్మికుల వేతనాల పెంపు, పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక  సమ్మె నాలుగో రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, సింగరేణి యాజమాన్య వైఖరికి నిరసనగా గోదావరిఖని చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా జేఏసీ నాయకులు కడారి సునీల్, సిహెచ్ ఉపేందర్, తోకల రమేష్, కె విశ్వనాథ్, మద్దెల శ్రీనివాస్ లు మాట్లాడుతూ సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం   ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి కనువిప్పు కలిగే విధంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యల ఎడల  నిర్లక్ష్య వైఖరి ఫలితంగానే  తాము సమ్మెబాట పట్టామని ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, సమ్మె నివారించాలని కోరారు, పారిశుద్ధ్య కార్మికులను విధులకు హాజరు కాకపోతే ఊరుకోమని కాంటాక్ట్ కార్మికులను  బెదిరిస్తున్న కాంట్రాక్టర్లు తమ వైఖరి మార్చుకోకపోతే ప్రజాస్వామ్య యుతంగా తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆ కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు, సొంత ఇంటి పథకం అమలు డిమాండ్లతో రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఈనెల 13వ తేదీ  చలో అసెంబ్లీ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ మహంకాళి స్వామి, సిపిఎం పార్టీ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు తుమ్మల రాజారెడ్డి ,హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు జేవి రాజు   జేఏసీ నాయకులు శనిగల శ్రీనివాస్, కోట వెంకన్న, మధు, కొమురయ్య, ఎన్ మదనమ్మ, పోషం, కనుకుంట్ల లక్ష్మణ్, సూరిబాబు, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.