మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు ఎంవిఐ రాహుల్ కుమార్

Published: Thursday December 01, 2022
జన్నారం, నవంబర్ 30, ప్రజాపాలన: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని బుధవారం మోటార్ వెఖీల్ ఇన్స్ పెక్టర్ రాహుల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో  వాహనాలు తనిఖీ చేసి దృవపత్రలు లేని వాహనాలను తనిఖీ చేసి సిజ్ చేసి స్థానిక పోలిస్ స్టేషను కు తరలించడం జరిగిందని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల ద్రృవపత్రాలు కలిగి  ఉండాలని, లైసెన్స్ ఇన్సూరెన్స్  తప్పనిసరి అయన తెలిపారు. అదేవిధంగా మెాటర్ సైకిల్ వాహనదారులు రోడ్డు పై ప్రయానించేటప్పుడు హెల్మెట్ దరించాలని పేర్కొన్నారు. త్వరలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.