ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసమే "మీరు నేను" కార్యక్రమంలో_ ఎమ్మెల్యే డా.సంజయకుమార్

Published: Monday March 06, 2023
రాయికల్, మార్చి 05 ;(ప్రజాపాలన ప్రతినిధి):
రాయికల్ మండల కట్కపూర్, ధావన్ పల్లి ,వస్తాపూర్ గ్రామాల్లో 'మీరు నేను' కార్యక్రమంలో భాగంగా కట్కాపూర్ లో శనివారంరోజురాత్రి పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్. ఈరోజు ఉదయం నుండి ఆయా గ్రామాలలో పలు వార్డులు తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ, అధికారుల ద్వారా పరిష్కరిస్తూ గ్రామంలో
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలగురించి ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఆయా గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.అనంతరం
కట్కపూర్ గ్రామంలో 32 లక్షలరూ.లతో వంతెన నిర్మాణ పనులకు, 10 లక్షలతో సిసి రోడ్డు మరియు1 లక్ష తో డ్రైనేజీ నిర్మాణానికి, ధావన్ పల్లి గ్రామంలో 10లక్షలతో పాఠశాల భవననిర్మాణానికి 10 లక్షలతో సిసి రోడ్డు,1లక్ష డ్రైనేజీ నిర్మాణానికి, వస్తాపూర్ గ్రామంలో శ్రీరామ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత ఆయా గ్రామాలలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన తదుపరి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ 'మీరు నేను' కార్యక్రమం ద్వారా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని చిన్న చిన్న సమస్యలను అధికారుల ద్వారా వెంటనే పరిష్కరించి మిగతా సమస్యలను జిల్లా యంత్రాంగం ద్వారా పరిష్కారం చూపడానికి పల్లెనిద్ర చేస్తున్నానని,
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులై పార్టీ లో చేరుతున్నారని,
రైతు బందు పథకం ద్వారా 440 మంది రైతులకు 4కోట్లు 40 లక్షలు ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో జమ అయ్యాయి.
రైతు మరణిస్తే ఎలాంటి పైరవీ లేకుండా 10 రోజుల్లో 5 లక్షల రైతు భీమా వస్తుందని,
సోలార్ విద్యుత్ లో అత్యదిక ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ, 
దాదాపు ప్రతి నెల 1000 కోట్లను ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు ప్రభుత్వం అందిస్తుందని,
82 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా 69 లక్షలు పంపిణీ జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ సంధ్యారాణి సురేందర్, జెడ్పీటీసీ అశ్వినిజాదవ్, బి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు  శ్రీనివాస్,ప్రధానకార్యదర్శిరాజేష్,ఎంపిడిఓ సంతోష్ కుమార్,సర్పంచ్ లు  రాజమౌళి,యమున రవి,సుమలత,ఉప సర్పంచ్  ముజాహిధ్,నాయకులు కార్యకర్తలు, ప్రభుత్వాధికారులు, తదితరులు పాల్గొన్నారు.