ఆర్టీసీ వేతనాలు సకాలంలో మంజూరు చేయాలి

Published: Tuesday September 21, 2021
వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాద గోని జంగయ్యగౌడ్ సోమవారం ముఖ్య నాయకుల తో కలిసి మాట్లాడుతూ 20 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సకాలంలో వేతనాలు మంజూరు చేయక నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం వేతనాలు సకాలంలో చెల్లించక ఇబ్బందులకు గురి చేయటం సరైన పద్ధతి కాదు అన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పటు అయితే ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఆర్టీసీ కార్మికుల ను అన్ని విధాలుగా అఫుకుంటాం అని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పటమే కాకుండా సకాలంలో వేతనాలు కూడా సకాలంలో మంజూరు చేయటం లేదు అని ఆర్టీసీ కార్మికులు ఆందోళ చెందుతున్నారు. నెల రాగానే ఇంటిలో ఎన్నో ఖర్చులు ఉంటాయి 20వ తేది వరకు కూడా వేతనాలు రాక పోవటంతో సమయానికి ఖర్చులకు డబ్బులు అందక ఆర్టీసీ కార్మికులు అప్పులు చేసి మరీ జీవనం సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే మా బ్రతుకులు మారతాయి మాకు మంచి రోజులు వొస్తాయి అనుకున్నాం గాని  వేతనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది అనుకోలేదు అన్నారు స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రతి నెల ఒకటవ తేదీ రోజు ఆర్టీసీ కార్మికుల వేతనాలు తమ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేవి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 15వ తేదీ దాటితే కానీ వేతనాలు రావటం లేదన్నారు. ఈ నెల20వ తేదీ వచ్చినా ఇప్పట్టి వరకు ఆర్టీసీ కార్మికుల కు వేతనాలు చెల్లించక పోవటం సిగ్గు చేటు అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల వేతనాలు వెంటనే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి నెల సకాలంలో వేతనాలుమంజూరు చేయాలి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  మంచాల మండలం వైయస్సార్ పార్టీ నాయకుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్, యాచారం మండలం వైయస్సార్ పార్టీ నాయకుడు పంది జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.