ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి గీత కార్మిక సంఘం ఆళ్లపాడు గ్రామ నాయకుల

Published: Monday November 14, 2022

బోనకల్ ,నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో గీత కార్మిక సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గీత కార్మిక సంఘం అధ్యక్షుడు కందుల సత్యం మాట్లాడుతూ గీత కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గీత కార్మికులను ఓట్ల కోసం మాత్రమే చూస్తున్నారని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామపంచాయతీకి ఐదు ఎకరాల భూమి తాటి, ఈత చెట్లు పెంచడానికి ఇస్తానని ఇంతవరకు అమలు చేయలేదని, గీత కార్మికుల రుణాలు మంజూరులో జాఫ్యం జరుగుతోందని, గీత కార్మికులకు చనిపోయిన తరువాత ప్రమాద బీమా కూడా ఆలస్యంగా అందుతున్నాయని, గీత కార్మిక సొసైటీ సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు మంజూరు చేస్తామని ఇంత వరకు వాటి జాడ లేకుండా పోయిందని, గీత కార్మికులకు సబ్సిడీపై తాళ్లు ఎక్కే యంత్రాలు మంజూరు చేయాలని ,అర్హత కలిగిన వారందరికీ సభ్యత్వాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం నాయకులు, మండల బీసీ సెల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల పాపారావు, వైస్ ప్రెసిడెంట్ మరీదు రామారావు, వీరంకి తిరుపతిరావు, తోట వెంకన్న, బండి నాగేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు నర్సింగుల నరేష్, బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు మరీదు రోశయ్య ,మంద కృష్ణ ,మరీదు వెంకటేశ్వర్లు, మరీదు రాములు, తదితరులు పాల్గొన్నారు.