పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి

Published: Thursday October 06, 2022
మేడిపల్లి, అక్టోబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి)
 దసరా పండగను పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి కొత్త బట్టలను పంపిణీ చేశారు.  
ఈ కార్యక్రమంలో 26వ వార్డ్ ఆఫీసర్ మహమ్మద్ వాజిత్,మున్సిపల్ సిబ్బంది ప్రభాకర్,రాజు,విజయమ్మ,పోచమ్మ, బాలమని,శారద తదితరులు పాల్గొన్నారు.