అబ్దుల్లాపూర్మెట్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం నా

Published: Wednesday April 20, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 19 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్ గ్రామం లోని అది కూలీలను సందర్శించి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఎర్రటి ఎండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు గత తొమ్మిది వారాల నుండి 15 వారాల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వాటిని వెంటనే కూలీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసివేయాలని ఉద్దేశంతో గతంలో ఉన్న సౌకర్యాలను కూడా, ఎండకాలంలో ఎండకాలం డబ్బులు, గడ్డపార, మొన్న పెట్టించుకోవడానికి, మంచి నీళ్ల డబ్బులు మేటి డబ్బులు, ప్రస్తుతం ఇవ్వడంలేదని పనిప్రదేశాల్లో కూలీలకు ఎండ కొట్టకుండా టెంట్లు, గడ్డపారలు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అలాంటివి లేకుండా కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ అన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుండె శివ పాల్గొన్నారు.