వరద నీటి కాలువ (స్ట్రాం వాటర్ డ్రైన్) నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశాలు

Published: Monday February 13, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి) 
పీర్జాదిగూడ, బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రూ.110 కోట్లతో నిర్మించతలపెట్టిన వరద నీటి కాలువ (స్ట్రాం వాటర్ డ్రైన్) నిర్మాణ పనులపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మంత్రి మల్లారెడ్డిని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ను  అసెంబ్లీ లో కలవడం జరిగింది. స్పందించిన మంత్రి మల్లారెడ్డి, ఎం ఏ యూ డి ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ రూ. 110 కోట్లతో  పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన ఎస్.ఎన్ డీ.పీ పనులను వెంటనే చేపట్టాలని కృషి ఇన్ఫ్రా కాంట్రాక్టు సంస్థ యజమాని ఆదేశించారు. మొత్తం రూ. 110 కోట్ల నిధులలో 69 శాతం ప్రభుత్వం, 31 శాతం స్థానిక కార్పొరేషన్ భరించాలని, ఇందుకు సంబంధించిన చర్చలు, ప్రణాళికలు, పరిపాలన అనుమతులు జారీ అయ్యాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరగానే పనులను ప్రారంభిస్తామని కాంట్రాక్టర్ మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి పురపాలక మంత్రి కేటీఆర్ కు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి, పురపాలాక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పాల్గొన్నారు.