జేఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం..

Published: Thursday July 21, 2022
ఖమ్మం, జూలై 20 (ప్రజా పాలన న్యూస్): జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మంజిల్లా  ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం అర్బన్ మరియు రూరల్ మండలాలలో కోటపాడు, కమంచికల్, ముస్తఫానగర్, గోపాలపురం గోళ్ళపాడు గ్రామాలలో స్వచత పక్వాడ కార్యక్రమాలలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై తడి పొడి చెత్తను వేరుచేయడం పైన ప్రజలందరకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎస్ఎస్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ మాట్లాడుతూ యువత ఉద్వోగం, స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడాలనుకునే వారు ఎప్పడికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరాక్చుకొని అంది వచ్చే అవకాశాలను వినియోగించుకొవాలని సూచించారు. మారుమూల గ్రామాలలో ఉన్న మహిళలు, యువతీ, యువకులు, అన్ని వర్గాల ప్రజలందరు ఈ శిక్షణ లో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని స్వయం శక్తితో ప్రతివారు ఎదగాలని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో వృద్ధి సాధించి దేశపురోభివృద్ధికి దోహద పడాలని కోరారు.  ఈ కార్యక్రమం లో జె యస్ యస్ లబ్ధిదారులు, స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ జాస్మిన్, సౌందర్య, భవాని, కవిత, రమేష్, రమాదేవి, యస్ కె. రజియా, గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ పెద్దలు పాల్గొన్నారు.