గిరిజన, ఆదివాసీలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించిన DSP సత్యనారాయణ..

Published: Thursday September 29, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు,
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని   మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామమైన కొత్త శ్రీరాంపురం కాలనీలో ఈరోజు  మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు పాల్వంచ డిఎస్పి సత్యనారాయణ మరియు పాల్వంచ సీఐ నాగరాజు,బూర్గంపాడు ఎస్ఐ సంతోష్, ఆధ్వర్యంలో మొరంపల్లి పి హెచ్ సి డాక్టర్ స్పందన, మరియు వారి బృందం శ్రీరాంపురం కాలనీ లోని సుమారు 200 మంది ఆదివాసి గిరిజనులకు ఉచిత వైద్యం అందించి వారికి కావలసిన మందులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాల్వంచ డిఎస్పి  సత్యనారాయణ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉంటూ వైద్యానికి ఇబ్బంది పడుతూ ఉంటారని  మంచి ఉద్దేశంతో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి IPS  మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని శ్రీరాంపురం కాలనీ ఆదివాసి, గిరిజన లందరూ హాజరై ఈ ఉచిత మెడికల్ క్యాంపు  సద్వినియోగం చేసుకున్నందుకు చాలా సంతోషం అన్నారు. అదేవిధంగా మీకు భద్రాద్రి జిల్లా పోలీస్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని విద్య ,వైద్యం, నీటి సరఫరా అన్ని రంగాల్లో మీకు సహాయం చేయడానికి భద్రాద్రి పోలీస్ ముందు ఉంటుందని హామీ ఇచ్చినారు. అదేవిధంగా యువత చెడు మార్గంలో నడవదని ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే వెంటనే పోలీసువారికి సమాచారం ఇవ్వాలని సూచన ఇచ్చినారు. ఈ సందర్భంగా శ్రీరాంపురం ఆదివాసీ గిరిజనలందరూ ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రామకృష్ణ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు