రెండవ రోజు సార్వత్రిక సమ్మె జయప్రదం : AITUC

Published: Wednesday March 30, 2022
మధిర మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు రెండోరోజు సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండవ రోజు మధిర ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మధిర ఆర్టీసీ డిపో ఎదుట AITUC నాయకులు బెజవాడ రవిబాబు  మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలను చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఆ దాని, అంబానీలకు ప్రభుత్వ రంగాన్ని కట్టబెడుతూ చేపడుతున్న చర్యలకు నిరసనగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని జాతీయ కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఈ నెల 28 29న సమ్మె జయప్రద అయిందని ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కళ్లు తెరచి ఉన్న చట్టాలను రద్దు చేయాలని ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం AITUC వెంకటేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.