జ్ఞాన జ్యోతికి మూలాధారం అక్షరాభ్యాసం

Published: Thursday June 23, 2022
సర్పంచ్ అంజయ్య, అంగన్వాడీ టీచర్ యాదమ్మ
వికారాబాద్ బ్యూరో జూన్ 22 ప్రజాపాలన : జ్ఞాన జ్యోతికి మూలాధారం అక్షరాభ్యాసం కార్యక్రమమేనని ద్యాచారం సర్పంచ్ ఎల్లన్నోల్ల అంజయ్య అంగన్వాడీ టీచర్ యాదమ్మ లు సంయుక్తంగా తెలిపారు. వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నూతనంగా చేరిన 4గురు విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎల్లన్నోల్ల అంజయ్య, కార్యదర్శి పుష్ప, అంగన్వాడీ టీచర్ యాదమ్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు మాట్లాడుతూ అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని పురోహితులచే వేద మంత్రాలతో శ్రీకారం అక్షరంతో చిన్నారుల పలకలపై దిద్దించామని పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసము చేసి, పిల్లల తల్లులకు ప్రతిరోజు అంగన్వాడికి తమ పిల్లలను పంపించాలని సూచించారు.  ఎల్కేజీ, యూకేజీ మెటీరియల్ అంగన్వాడి సెంటర్ లో పిల్లలకు అందిస్తామని స్పష్టం చేశారు. అదే విధముగా అనుబంధ పోషకాహారంలో భాగంగా అన్నము, పప్పు, గుడ్డు, మధ్యాహ్న భోజనం పెడుతున్నామని వివరించారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనము అందజేస్తున్నామని తెలిపారు.