మల్లన్నపెట్ గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని అభినందించిన జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మరియు జిల్

Published: Tuesday September 20, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): గొల్లపల్లి మండలo మల్లన్నపెట్ గ్రామ గౌడ సంఘం కమిటీ అధ్యక్షులుగా బండారి గంగాధర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన ఎన్నికైన కార్యవర్గ సభ్యులను జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మరియు జిల్లా గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ వారిని శాలువాతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గాజుల తిరుపతి గౌడ్, కోశాధికారి గాజుల గంగాధర్, ప్రధాన కార్యదర్శి బండి దేవేందర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు బండారి శ్రీనివాస్, గర్వందుల లక్ష్మణ్, గాజుల తిరుపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.