జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవుట్సోర్సింగ్ దరఖాస్తుల ఆహ్వానం

Published: Tuesday October 19, 2021
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం
వికారాబాద్ బ్యూరో 18 అక్టోబర్ ప్రజాపాలన : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 27 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంల (మహిళలు) పోస్టుల భర్తీ కొరకు ఆవుట్సోర్సింగ్  ప్రాతిపాదికన  దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం సోమవాారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇట్టి పోస్ట్  లకు అభ్యర్థులు టిఎస్ నర్స్, నర్స్-మిడ్ వైఫ్ సహాయక నర్స్-మిడ్ వైఫ్ మరియు ఆరోగ్య సందర్శకుల మండలి నమోదు చేయబడి ఉండాలి. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎం పి హెచ్ డబ్ల్యూ (ఎఫ్) శిక్షణ కోర్సు, ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుఫత్రులలో ఏడాది క్లినికల్ శిక్షణ, గుర్తించిన ఆసుపత్రులలో (1) సంవత్సరం అప్రెంటీస్ శిక్షణ కల్గి ఉండాలని అన్నారు. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ ద్వారా అప్రెంటిస్ షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఉండాలి. తప్పనిసరిగా తెలంగాణ పారామెడికల్ బోర్డులో నమెదు చేసుకుని ఉండాలి. అర్హులైన అభ్యర్థినుల నుండి తేదీ:20-10-2021 నుండి 22-10-2021 సాయంత్రం 5.00 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని జిల్లా వైద్య అధికారి తెలియజేశారు.