మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

Published: Thursday April 21, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదిన వేడుకలు టిడిపి ఇబ్రహీంపట్నం ఇన్చార్జి చింతకింది చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మదిన సందర్భంలో పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జేలమొని రవీందర్ తెలుగుయువత పార్లమెంటు అధ్యక్షులు జక్కా కర్ణాకర్, వంగళ కృష్ణ, మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ మంకు ఇందిర, మున్సిపల్ అధ్యక్షులు జక్క రామ్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షుడు వీరేశం, కాసుల వీరాచారి, బొమ్మకంటి అశోక్, కప్పరి అంజయ్య, ప్రభాకర, శ్రీనివాస్ చారి, మున్సిపల్ మండల తెలుగు యువత నాయకులు ఆవుల శ్రీను యాదవ్, రాములు, దనుంజయ, భద్రయ్య, చంద్రయ్య, రాజేష్ యాదవ్, గాలయ్యా, ప్రవీణ్, మల్లమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు.