సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన

Published: Tuesday July 26, 2022
మంచిర్యాల బ్యూరో, జులై 25, ప్రజాపాలన :
 
ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి  మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రహదారులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలకుండా పురపాలక, పంచాయ తీరాజ్, సంబంధిత శాఖల సమన్వ యంతో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పిం చాలని, ఆగస్టు మాసం నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 12-17 వయస్సు గల విద్యార్థులకు వంద శాతం వ్యాక్సి నేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.  కాచిన చలార్చి వడపోసిన నీటిని త్రాగే విధంగా ప్రచారం చేయాలని, అధికారులు తరచూ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని చూసించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని, వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, పురపాలక శాఖల అధికారులు సమన్వయంతో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు అధికంగా నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి నియంత్రణ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులను అందించడం జరుగుతుందని, విషజ్వరాల అనుమా నితులకు పరీక్షలు నిర్వహించి తగు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారా యుడు. జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.