గ్రీన్ భద్రాద్రి వారిని అభినందించిన ఫారెస్ట్ అకాడమీ హైదరాబాద్

Published: Monday June 13, 2022

భద్రాద్రికొత్తగూడెం(ప్రజాపాలన బ్యూరో)ఫారెస్ట్ అకాడమీ హైదరాబాద్ వారు  గ్రీన్ భద్రాద్రి వారు నాటిన మొక్కలను పరిశీలించి గత పుష్కర కాలంగా భద్రాచల పట్టణంలో ప్రధాన రహదారులలో మరియు వివిధ కాలనీలలో గ్రీన్ భద్రాద్రి వారు నాటి సంరక్షించిన మొక్కలు నేడు మహా వృక్షాలుగా మారాయి అని రహాదారుల పక్కన నాటిన పూల చెట్లు ఆహ్లాదకరం గా బాటసారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని,ఫారెస్ట్ అకాడమీ అధికారులు గ్రీన్ భద్రాద్రి టీం ని అభినందించారు.గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం సుమారు 6000 మొక్కలు వివిధ కాలనీలలో నాటామని, నీడనిచ్చే మొక్కలతో పాటు పళ్ళ మొక్కలను కూడా నాటామని, అట్టి మొక్కలకు ట్రీ గార్డులు అమర్చి ఈ వేసవి కాలంలో ఉదయం సాయంత్రం మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందించి అలాగే వాటికి కావాల్సిన సూక్ష్మ ఎరువులు అందించామని ఈ బృహత్తర కార్యక్రమంలో భద్రాచల పట్టణ పుర ప్రముఖులు,దాతలు,వివిధ స్వచ్చంద సంస్థలు ఇతోధికంగా సహకరించారని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి వాలీ, గ్రీన్ భద్రాద్రి ప్రధాన కార్యదర్శి పామరాజు తిరుమల రావు,కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి,గాదె మాధవ రెడ్డి,పి ఆర్ ఓ.కడాలి నాగరాజు,పార్క్ కృష్ణ, అన్నెం వెంకటేశ్వర రెడ్డి,రాసమల్ల రాము,ఆర్ కె  నాయుడు,రాణి,ఫారెస్ట్ అకాడమీ ఉద్యోగులు పాల్గొన్నారు.