ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 6ప్రజాపాలన ప్రతినిధి *వంశీ అనే విద్యార్థికి న్యాయం చేయాలి* *ఫీజులన

Published: Monday November 07, 2022

  గురునానక్ యూనివర్సిటీలో CSE మూడో ఇయర్ చదువుతున్న వంశీ అనే విద్యార్థి గత నాలుగు రోజుల క్రితం ఫీజు కట్టడం లేదని యాజమాన్యం ఒత్తిడి చేయడం వల్ల వంశీ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది వంశీ మృతి పట్ల ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ సంతాపాన్ని తెలియజేస్తుంది.

              వంశీ ది ఆత్మహత్య కాదని యూనివర్సిటీ హత్య అని *ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మస్కు చరణ్* అన్నారు గత నాలుగు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం లోని గురునానక్ యూనివర్సిటీలో ఫీజు కట్టలేదని ఒత్తిడి వల్ల వంశి అనే విద్యార్థి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చి ఫీజుల దోపిడీ చేయమని ఓ రకంగా ప్రోత్సహిస్తుందని అన్నారు . ఫీజులు కట్టలేక గత వారం రోజుల కాలంలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని అందులో వంశీ అనే విద్యార్థి చనిపోయాడని అన్నారు . కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు . అలాగే వంశీ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా యూనివర్సిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఫీజులు తగ్గించని యెడల రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని వారు అన్నారు