సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

Published: Monday October 17, 2022

మధిర రూరల్ అక్టోబర్ 16 (ప్రజా పాలన ప్రతినిధి) సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కళాకారుడు హెల్త్ సూపర్వైజర్ లంకా కొండయ్య కోరారు.  ఆదివారం  దెందుకూరు పిహెచ్సి వైద్యులు శశిధర్ సూచనల మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు హరీష్ రావు ఆదేశాలు మేరకు లంక కొండయ్య తన నివాసంలో ఉన్న నిల్వ నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంతoలో దోమలు వృద్ధి చెందకుండా, దోమలు కుట్ట కుండా ప్రతి అదివారం ఉదయం 10 గంటల 10 నిముషాల కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన కోరారు. ప్రజలకు అవగాహన నిమిత్తం తన ఇంటిలో ఉన్న మొక్కల కుండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగించడం జరిగిందన్నారు. దోమల నివారణకు నివాస ప్రాంతాల్లో నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పని చేసే ప్రతి సిబ్బంది స్వచ్చందంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు.

 
 
 
 
Attachments area