హిందు దేవి,దేవతలపై అనుచిత వ్యాక్యలు చేసిన బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలి.

Published: Saturday December 31, 2022

కోరుట్ల, డిసెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి):
అయ్యప్ప మాల ధరించి ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించే ఆ అయ్యప్ప స్వామిని దూశించడం, అయ్యప్ప స్వామి దీక్షాపరుల మనోభావాలను దెబ్బతీసిన బైరి నరేష్,ఇలాంటి వారిపై ప్రతి ఒక్కరూ ప్రతి ఊళ్ళల్లో బైరి నరేష్ పై కేసు పెట్టాలని హిందు దేవతల చరిత్ర పై అసభ్యంగా మాట్లాడి హిందు మనోభావాలను దెబ్బతీసిన వాడి పై పిడి యాక్ట్ నమోదు చేయాలని కోరుట్ల అయ్యప్ప దేవాలయం పక్షాన లిఖిత పూర్వకంగా పోలీస్టేషన్ లో పిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ గౌరవ అధ్యక్షుడు చిదురాల నారాయణ గురుస్వామి, ఆలయ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ స్వామి, కౌన్సిలర్ పెండం గణేష్ స్వామి,ముక్కెర శేఖర్ స్వామి,జుమ్బర్తి రమేష్,సత్యారావు,
యాగండ్ల శ్రీనివాస్,గడ్డం మధు,సత్యపాల్,నీలి శ్రీనివాస్,కాసు క్రాంతి,మార్గం నరేష్, దామ రాజేష్,స్వాములు పాల్గొన్నారు,అయ్యప్ప స్వాములు వాడి పై పిడి యాక్ట్  కేసు నమోదు చేసే వరకు ఉద్యమించాలని అన్నారు.