ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం

Published: Tuesday June 08, 2021
పరిగి 7 జూన్ ప్రజాపాలన ప్రతినిధి : రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తానని ప్రకటిస్తూ నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయటం లేదని వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని పాలే పల్లి, గ్రామంలో కొనుగోలు కేంద్రం ముందు రోడ్డుపై వరి ధాన్యం పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న తహసిల్దార్, పోలీసులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మరోపక్క బాస్ పల్లి గ్రామంలో మరో రైతు కృష్ణ తమ ధాన్యం తీసుకోవడం లేదని  ఎన్నిసార్లు అడిగినా బస్తాలు లేవని లారీ లో లేవని  అధికారులు కాకమ్మ కథలు చెబుతున్నారని రైతు ఐకెపి కొనుగోలు కేంద్రం పైకి ఎక్కి తాడుతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు. దీనితో అక్కడ గ్రామస్తులు అతనికి సర్దిచెప్పి కిందికి దింపారు. రైతు కృష్ణ మాట్లాడుతూ తను చేసిన అప్పులు కట్టలేక తన తల్లి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చూపించడానికి డబ్బుల్లేక ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోపక్క వరి ధాన్యం తడిసి ముద్ద అవుతున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని అన్నిి జిల్లాల్లో ఎటు చూసినా తమ ధాన్యాo రోడ్లపై నిలిచిపోయిందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక బస్తాకు 4కిలోల నుంచి 5కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ధాన్యం ఎక్కడ తడసి పోతుందోనని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లన రైతులు కన్నీరు కారుస్తున్నారు. రైతులను కన్నీరు పెట్టించటo మంచిది కాదు అని రైతులు మండిపడుతున్నారు. దేవుడు కరుణించిన పూజారి మాత్రం కరుణించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు కరుణించి వర్షాలు బాగా పడి పంటలు బాగా పండిస్తే, ప్రభుత్వం మాత్రం పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆందోళనలు నిరసనలు రోడ్లపై చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు చేయాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.