లాక్ డౌన్ బాధితులను ఆదుకుందాం

Published: Tuesday June 01, 2021
మధిర ప్రజా ప్రతినిధి : 31వ తేదీ మధిర మున్సిపాలిటీ పరిధిసాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమారి జమ్మల కావ్య ఈ రోజు ఉదయం 8 గంటలకు అజాద్ రోడ్, మధిర నందు ప్రముఖ సామజిక సేవకులు మధిర ఆశ మిత్ర లంకా కొండయ్య సూచించిన నిరుపేద అభాగ్యుల కుటుంబాలకు ఒకొక్కరికి ఒక నెలకూ సరిపడా బియ్యం కిరాణా సరుకులు  ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీరు, డాక్టర్ రామనాధం గారి ఏరియాలో నివాసముంటున్న రైతు బిడ్డ మోటారు మెకానిక్ శ్రీ జమ్మూల కోటేశ్వరావు ఏకై క కుమార్తె జమ్మల కావ్య పుట్టినరోజు సందర్బంగా కరోనా సెకండ్ వేవ్ లో లాక్ డౌన్లోఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబములకు చేయూత అందించారు. అదేవిధంగా ప్రముఖ షామియానా వ్యాపారులు గాలి ప్రసాద్ రావు, మధిర పట్నం వాసులు కూడా కొన్ని నిరుపేద కుటుంబములకు నెలవారీ సరుకులు కొండయ్య ద్వారా అందించారు. ఈ సందర్బంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జమ్మల కావ్య మాట్లాడుతూ మన ఇంటిలో మన పుట్టినరోజు వేడుకలకు చేసే వృధా ఖర్చులు పెట్టెబదులు నిరుపేద అభాగ్యులకు సహాయం చేయటం భగవoతునికి సేవ చేసినట్లే అని కావ్య అన్నారు. ఆదేవిధంగా గాలి ప్రసాద రావు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఎదుటి వారికి సహాయం చేయటం మానవత్వ ధర్మం అని ఇలా ప్రతి ఒక్కరు ఇతరులకు సహాయపడాలి అని తెలిపినారు. ఇలాంటి సేవా సహాయం కార్యక్రమం అడగటంతోనే ముందుకొచ్చిన దాతలు  జమ్ముల కోటేశ్వరావు గారికి, జమ్ముల కావ్య గారికి గాలి ప్రసాదరావు గారికి లంకాకొండయ్య లంకా ఫౌండేషన్ తరపున హృదయ పూర్వక అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు అధిములం వెంకటేష్, లంకా కరుణ లియోనా, లంకా శ్యామ్ కుమార్, అంజి, గోపి, సాయి తదితరులు పాల్గొన్నారు.