మొక్కలతోనే పర్యావరణ సమతుల్యత

Published: Wednesday July 14, 2021
- లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పోలీస్ శ్రీనివాస్
మెట్ పల్లి, జూలై 13 (ప్రజాపాలన ప్రతినిధి) : మొక్కల తోని పర్యావరణం అసమతుల్యత సాధ్యమవుతుందని మెట్ పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పోలీస్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వెంకటేశ్వర దేవాలయం వద్ద  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సబ్బని చంద్రశేఖర్, కోశాధికారి మర్రి భాస్కర్, చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, మహాజన్ నర్సింహులు, డొంతుల రాజ్ కుమార్, ఇల్లేందుల శ్రీధర్, రాకేష్, మహాజన్ శివకుమార్, ఇల్లేందుల కిషన్, ముద్దం ప్రసాద్, తిరుమల చారి, కోట విజయ్ కుమార్, ప్రసాద్, ముత్యం, ఆనంద్, గుంటుక అరవింద్ తదితరులు పాల్గొన్నారు.