ఎన్నికల హామీలను నెరవేర్చాలి- మర్రి వెంకటస్వామి

Published: Saturday February 04, 2023

శంకరపట్నం ఫిబ్రవరి 03 ప్రజాపాలన రిపోర్టర్ :



శంకరపట్నం మండల కేంద్రంలో సిపిఐ మండల  కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో శుక్రవారం  జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు ఉపాధి హామీ పథకానికి నిధులు ఎక్కువ కేటాయించకపోవడం పట్ల ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా ఉందని  తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా విభజన హామీలను నెరవేర్చ నిధులను కేటాయించడంలో పూర్తిగా వైపల్యం చెందిందని,రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయకుండా జాప్యం చేస్తుంది వితంతు, వికలాంగులు, ఆసరా పెన్షన్లు కొత్తగా ఇవ్వడం లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నీళ్లు,నిధులు, నియామకాలు అనే నినాదాలతో నూతనంగా రాష్ట్రం ఏర్పడిన ఈ నినాదాలు కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నా ప్రభుత్వము ఇవ్వకుండా నూతనంగా కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ వాటిని రిక్రూట్మెంట్ చేయడంలో పూర్తిగా జాప్యం చేస్తున్నదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్రంగా వ్యతిరేకత ఉందని, రైతాంగానికి లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా జాప్యం చేస్తున్నదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఇలాగే జాప్యం చేస్తే కాలయాపన కొనసాగిస్తే  ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఫిబ్రవరి చివరి వారంలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని వారు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కుమార్, రవీందర్, వెంకటయ్య రవి, సదానందం తదితరులు పాల్గొన్నారు.