పెంచిన ధరలను తగ్గించాలి : సబ్బని కృష్ణ

Published: Tuesday June 08, 2021

బెల్లంపల్లి, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని లేదంటే అన్ని వర్గాల పార్టీలు ప్రజలతో ఏకం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎం సిపిఐ యు మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఇ సబ్బని కృష్ణ అన్నారు. సోమవారం నాడు స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తాలో మోటార్ సైకిళ్లకు తాళం పెట్టి లాగుతూ నిరసన తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రాణాలు, ఆస్తులు సర్వం కోల్పోతున్న ప్రజలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ చుక్కలు చూపిస్తుందని, ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల దిన కూలీలు, రెక్కాడితే డొక్కాడే కష్టజీవులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు తల్లడిల్లుతున్నారని అన్నారు, ప్రజావ్యతిరేక పాలనను ఇప్పటికైన మానుకొని పెంచిన అధిక ధరలను వెంటనే తగ్గించకపోతే, అన్నివర్గాల ప్రజల్ని ఆదుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు, ప్రజాస్వామ్య, అభ్యుదయ వాదులు, ప్రగతిశీల శక్తులు అధిక ధరలపై మోడీ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించి బూర్జువా పాలనకు బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్బని కృష్ణ, సబ్బని రాజేంద్రప్రసాద్, ఆరేపల్లి రమేష్ విజయలక్ష్మి, గౌతమి, అరుణ్, నరేష్, అశోక్, ఆకాష్, బండి మల్లేష్, రాళ్లబండి కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు