ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి *ఆరుట్ల బుగ్గరామలింగేశ్వర దేవాలయాన్ని ప్రభు

Published: Saturday November 05, 2022

మంచాల మండలం అరుట్ల గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీరాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ అరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం నగరానికి కూతవేటు దూరంలోఉంది దక్షిణ కాశీ బుగ్గరామలింగేశ్వర దేవాలయంగా పేరు పొందిన పుణ్యక్షేత్రం కానీ అబివృద్ది చెందటంలో ఆమడ దూరం ఉంది అన్నారు ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు మొదలు అయ్యి అమావాస్య వరకు బుగ్గరామలింగేశ్వర జాతర కోన సాగుతుంది 15 రోజుల పాటు జరిగే జాతరకు రాష్ట్రం నాలుగు ములల నుండి భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు ప్రతి ఏటా ఎంతో మంది రాజకీయ పార్టీల పెద్దలు ప్రజా ప్రతినిధులు బుగ్గరామలింగేశ్వర దేవాలయాన్ని దర్శించుకొని దేవాలయాన్ని అన్ని విధాలుగా ఆబివృద్ధి చేస్తాం అని గొప్పలు చెప్పే ప్రజా ప్రతినిధులు ఇప్పట్టి వరకు అభివృద్ధి చేసింది ఏమి లేదు అన్నారు.  జాతర ప్రారంభం అయ్యే సమయంలో నే భక్తుల సౌకర్యం కోసం తాత్కాలిక మర్మతులు చేపట్టి అరకొర సదుపాయాలు కల్పించటం తప్ప ఎల్లప్పుడూ సదుపాయాలు ఉండేలా నిర్మాణాలు చేయటం లేదు అని అన్నారు. బుగ్గరామలింగేశ్వర దేవాలయం చుట్టూ కొండల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఎల్లప్పుడూ కొండల మధ్యనుండి నీరు గుండంలకు చేరుకొని బుగ్గరామలింగేశ్వర స్వామిని తకుకుంటు నీరు ప్రవహిస్తోంది      అలాంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందిఅన్నారు పక్కనే ఉన్న రాచకొండగుట్టలో ఉన్న సరళ మైసమ్మ దేవాలయం ఎంతో అభివృద్ధి అయ్యింది ప్రతి రోజు భక్తులు సరళ మైసమ్మ దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించటం జరుగుతుంది మరి బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం ఎందుకు అభివృద్ధి జరగటం లేదు పాలకుల నిర్లక్ష్యమ ప్రభుత్వ నిర్లక్ష్యమ అర్థం కావటం లేదు అన్నారు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎంతో పేరు ఉన్న పుణ్యక్షేత్రమైన బుగ్గరామలింగేశ్వర దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ లో కలిపి అభివృద్ధి చేయాలి ప్రతి పండుగ రోజు బుగ్గరామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి దేవాలయం ఆవరణలో ఎల్లప్పుడు భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యం లేకుండా సదుపాయాలు కల్పించి బుగ్గరామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు జరిగేలా ఒక ప్రత్యేక పూజరిని నియమించాలి బుగ్గరామలింగేశ్వర దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్.