ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

Published: Friday February 18, 2022

కోరుట్ల, ఫిబ్రవరి 17(ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  పుట్టినరోజు సందర్భంగా టి.ఆర్.ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశానుసారం టి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా కరోనా సమయంలో విశిష్ట సేవలందించిన ఆశా వర్కర్లు, అంగన్ వాడి టీచర్లు, ఆర్పీలకు సన్మానం మరియు గిఫ్ట్ లను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనీల్, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, ఎంపిపి తోట నారాయణ, మార్కెట్ చైర్ పర్సన్ గుడ్ల లక్ష్మి మనోహర్, పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనీల్, ప్రధానకార్యదర్శి గుడ్ల మనోహర్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.