పరస్పర బదిలీలపై టీచర్ల అంగీకార పత్రాలు నిలుపుదల చేయాలి

Published: Friday May 27, 2022
టీపిటీఎఎఫ్ జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్.
 
కరీంనగర్,మే 26 ప్రజాపాలన ప్రతినిధి :
 టీచర్ల పరస్పర (మ్యూచువల్) బదిలీలకు సర్వీస్ రక్షణతో అనుమతించి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగు వేయడం, టీచర్లను అంగీకార పత్రాలు ఇవ్వాలనడం సరికాదని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భావిస్తుందని, దీనివల్ల టీచర్లకు అన్యాయం జరుగుతున్నందున ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపిటీఎఫ్ కరీంనగర్ జిల్లా  అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి , డిమాండ్ చేశారు. జి.ఓ. 21 ద్వారా పరస్పర బదిలీలకు అనుమతించి, జి.ఓ.402 ద్వారా సర్వీస్ రక్షణ కల్పిస్తూ దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు కోర్టు ఆదేశాల సాకుతో సర్వీస్ రక్షణ లేకుండా బదిలీకి టీచర్ల అంగీకార పత్రాలు కోరడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బదిలీ దరఖాస్తు విరమించుకున్న తర్వాత కోర్టు తీర్పు సర్వీస్ రక్షణకు అనుకూలంగా వస్తే ఆ టీచర్లకు తీవ్ర అన్యాయం చేయడం జరుగతుందన్నారు కాబట్టి టీచర్ల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవడం మానేసి జి.ఓ.402 అమలుకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చేలా కృషి చేయాలని  డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే సర్వీస్ తో కూడిన ఉత్తర్వులు జారీ చేసి పర్సుపర బదిలీలు చేయాలి అని పోరెడ్డి దామోదర్ రెడ్డి,చెంద్ర శేఖర్,జే. రామచంద్ర రెడ్డి లు అన్నారు.