మల్కిజ్ గూడెం గ్రామంలో నెల రోజుల నుండి ఉపాధిహామీ

Published: Tuesday March 15, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 14 ప్రజాపాలన ప్రతినిధి : పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి కూలీల సమస్యలు  పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఆఫిస్ ముందు ధర్న అధికారులు నిర్లక్ష్యం కారణంగా చింత పట్ల గ్రామంలో 200 మంది కూలీలు దరఖాస్తు చేసుకుంటే 61మందికి పనికల్పించడంవలన మిగతా 140 మంది కూలీలు వేణుతిరగడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  జిల్లా జాయింట్ సెక్రెటరీ పి అంజయ్య. జిల్లా నాయకులు  సిహెచ్ సత్యం మాట్లాడుతూ ఉపాధి పని మీద అవగాహన లేని గ్రామ పంచాయతీ సెక్రెటరీలాకు పని అప్ప చెప్పిన తర్వాత కూలీలకు సరైన పద్ధతిలో పని కల్పించకపోవడం జరుగుతుంది కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకొని వారి ద్వారా పని చేయించాలి ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్నాయి ఈ ఆలోచన విరమించుకోక పొతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాము నెల రోజుల నుండి పని చేస్తున్న పెండింగ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలి రెండు గంటల వరకు పని చేయాలనే నిబంధన ఎత్తివేసి. ఉదయం పూట మాత్రమే పని కల్పించాలి దరఖాస్తు చేసుకున్న ప్రతికూలికి రసీదు ఇవ్వాలి. వారికీ వెంటనే పని కల్పించాలి. పని కల్పించని ఎడల నిరుద్యోగ భృతి ఇవ్వాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి పే స్లిప్ ఇవ్వాలి. పనిముట్లు ఇవ్వాలి. మాస్టర్ తెలుగులో ఇంటి పేరుతో సహా రాయాలి మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలిని తదితర సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం కూలీలా కమిటీలు మేడం జరిగింది మల్కిజ్ గూడెం అధ్యక్షులు దమయంతి. కార్యదర్శి ఏ మహేందర్. సహాయ కార్యదర్శులు:-రాణి నరసింహ చారి. ఉపాధ్యక్షులు:- లావణ్య. రఘు. బి.సత్య నారి 20 మందితో కమిటీ చింత పట్ల కె.యాదయ్య. కార్యదర్శి. సిహెచ్ సత్యం. ఉపాధ్యక్షులు:-బి.యాదయ్య. ఎం.మమత. ఎం సత్యం. కె.చైతన్య. సహాయ కార్యదర్శులు  ఎన్ యాదమ్మ. పి శ్రీను. డి సుజాత 20 మందితో కమిటీ వేయడం జరిగింది.