పులుమద్ది గ్రామంలో ప్రసాద్ కుమార్ చేసిన అభివృద్ధే కనిపిస్తుంది

Published: Thursday February 16, 2023
* బిఆర్ఎస్ పార్టీ నాయకులకు సవాల్
* పులుమద్ది గ్రామ కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
వికారాబాద్ బ్యూరో 15 ఫిబ్రవరి ప్రజాపాలన : పులుమద్ది గ్రామంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన అభివృద్ధి పనులే నేటికీ దర్శనమిస్తున్నాయని పులుమద్ది గ్రామ మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోయిని శివయ్య ముదిరాజ్, గ్రామ వార్డు మెంబర్ మాణిక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య గౌడ్, బాసుపల్లి ప్రభాకర్ రెడ్డి లు బిఆర్ఎస్ నాయకులకు  ప్రతి సవాల్ విసిరారు. బుధవారం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసాద్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో లక్షలాది రూపాయలు పులుమద్ది గ్రామానికి మంజూరు చేసి అభివృద్ధి చేశారని వివరించారు. ప్రస్తుతం విమర్శిస్తున్న బిఆర్ఎస్ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులేనని గుర్తు చేశారు. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఏమేమి అభివృద్ధి పనులు చేపట్టారు బహిరంగ సవాల్ కు సిద్ధం కావాలని సూచించారు. మండలంలో కానీ గ్రామంలో గాని కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వమనడం మీ అయ్య జాగీర్ కాదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఎవరు ఎవరిని తిరగనివ్వరో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.