వికలాంగులకు బ్యాటరీ సైకిళ్లు అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్

Published: Saturday December 31, 2022

కొడిమ్యాల, డిసెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం రోజున మండలంలోని కొడిమ్యాల,రామకిష్టాపూర్, తిరుమలాపూర్ కోనాపూర్ నాచుపల్లి చెప్యాల,హిమ్మత్ రావ్ పేట, పూడూరు, దమ్మయ్యపేట , నమిలకొండ, గ్రామాలలోని  వికలాంగులకు 16 మంది
బ్యాటరీ ,ట్రై సైకిళ్లను చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను గ్రామాలలో తిరుగుతున్నప్పుడు దివ్యాంగులు వికలాంగులు, దివ్యాంగులు మాకు బ్యాటరీ సైకిల్ కావాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వికలాంగులు దివ్యాంగులు విద్యార్థినీ విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా స్కూటీలను కూడా పంపిణీ చేద్దామన్నారు.

భారతదేశ చరిత్రలోనే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు, ఆత్మగౌరవంతో జీవించడం కొరకు పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఇక్కడ ఎంపీడీవో పద్మజ,
వారి వెంట ప్రజాప్రతినిధులు ఎంపీపీ మేనేని జెడ్ పి టి సి పునుగోటి ప్రశాంతి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పునుగొటి కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, ఏఎంసీ చైర్మన్ కోరండ్ల నరేందర్ వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షులు ఊట్కూరి మల్లారెడ్డి,బారాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్,  వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.