మైనర్ బాలిక మేచర్ల సంజనకు న్యాయం చేయాలి

Published: Tuesday January 11, 2022
బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దామెర్ల పృథ్వీ రాజ్ డిమాండ్
బోనకల్, జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన కట్ల గోపిచంద్ అనే వ్యక్తి  తమ ఇంట్లో జొరబడి తన కన్న తల్లిని ఏదో పని ఉంది తిసుకోని వెళ్తున్నా అని చెప్పగా కట్ల గోపి చంద్ ని ఆమె కూతురు  మేచర్ల సంజన మందలించగా ఆ బాలికను కత్తి కోడవలితో అడ్డంగా నరుకుతానని బెదిరించి భయపెట్టించగా స్థానిక పొలిస్ స్టెషన్ లో ఫిర్యాదు చేయ్యడం జరిగింది. నిందితుడు అయినా కట్ల గోపి చంద్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించి మేచర్ల సంజనకి న్యాయం చేసి రక్షణ కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జిలు మిరియాల నాగరాజు, దస్తగిరి, అసెంబ్లీ అధ్యక్షుడు గద్దల శ్రీనువాసరావు, బి ఎస్ పి బోనకల్, చింతకాని మండలాల అధ్యక్షులు గార్లపాటి రవి, డి.రమే‌ష్, మండల నాయకులు వంశీ, కళ్యాణ్, నాగరాజు, ఆనంద్, ప్రశాంత్, కార్తిక్ పాల్గొన్నారు.