12వ వార్డు లో తెరాస పార్టీ జెండా ఆవిష్కరణ.

Published: Thursday April 28, 2022
రాయికల్, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) రాయికల్ పట్టణ కేంద్రంలో 12వ వార్డులో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం పట్టణ అధ్యక్షుడుమోర రామ్మూర్తి మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్.కే.సంజయ్ కుమార్ నేతృత్వంలో రాయికల్ పట్టణం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, వార్డు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు